టాటా ట్రస్ట్ చైర్మన్‌గా నోయెల్ ఎన్ టాటా ఎన్నిక

భారత ప్రముఖ వ్యాపార వేత్త, టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా ఈ నెల 9 బుధవారం రాత్రి 11.30 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో యావత్ దేశం షాక్ కు గురైంది.

Update: 2024-10-11 09:03 GMT

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రముఖ వ్యాపార వేత్త, టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా ఈ నెల 9 బుధవారం రాత్రి 11.30 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతితో యావత్ దేశం షాక్ కు గురైంది. అనంతరం దేశ ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆయనకు నివాళులు అర్పించారు. కాగా గురువారం సాయంత్రం ముంబైలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడంతో వారసులు ఎవరూ లేకపోవడం కారణంగా.. తదుపరి టాటా గ్రూప్ చైర్మన్ ఎవరనే ప్రశ్న దేశ ప్రజలను కలిచివేసింది. అయితే అందరూ ఊహించినట్లుగానే నోయెల్ ఎన్ టాటా ను టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు టాటా ట్రస్ట్ ప్రకటించింది. దీంతో ఆయన భారతదేశంలో అతిపెద్ద పబ్లిక్ ఛారిటబుల్ ఫౌండేషన్‌గా మరియు $165-బిలియన్ల టాటా గ్రూప్‌కు యజమానిగా కొనసాగున్నారు.

ఎవరీ నోయెల్ ఎన్ టాటా..?

67 ఏళ్ల నోయెల్ టాటా నావల్ H. టాటా, సిమోన్ N టాటాల కుమారుడు. ఇతను రతన్ టాటా యొక్క సవతి సోదరుడు. ఈయన నోయెల్ టాటా సస్సెక్స్ యూనివర్సిటీ (UK) నుండి డిగ్రీ పూర్తి చేశారు. INSEADలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP)ని కూడా పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్నా ఈయన టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే అనేక టాటా గ్రూప్ కంపెనీల బోర్డులలో ట్రెంట్, వోల్టాస్ & టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ఛైర్మన్‌గా సేవలందిస్తున్నారు. తన కార్పొరేట్ బాధ్యతలతో పాటు, నోయెల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో ట్రస్టీ గా కూడా ఉన్నారు. టాటా గ్రూప్ యొక్క ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్ విభాగం అయిన టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగారు. ఆగస్ట్ 2010, నవంబర్ 2021 మధ్య అతను $500 మిలియన్ల టర్నోవర్ నుండి $3 బిలియన్లకు పైగా కంపెనీ వృద్ధిని పర్యవేక్షించాడు.టాటా ఇంటర్నేషనల్‌లో తన పదవీకాలానికి ముందు, నోయెల్ టాటా ట్రెంట్ లిమిటెడ్‌లో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, అక్కడ అతను వివిధ ఫార్మాట్‌లలో కంపెనీ విస్తరణలో కీలక పాత్ర పోషించాడు, 1998లో ఒకే స్టోర్ నుండి నేడు 700 స్టోర్‌లకు పెరిగింది.


Similar News