'మహా' కూటమిలో ముసలం.. అలిగి వెళ్ళిపోయిన అజిత్ పవార్

మహారాష్ట్ర అధికార కూటమి 'మహాయుతి'లో మరోసారి విభేదాలు చెలరేగాయి.

Update: 2024-10-11 10:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర అధికార కూటమి 'మహాయుతి'లో మరోసారి విభేదాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గం, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గం మధ్య ఇప్పటికే గొడవలు ఉన్నట్టు ప్రచారం జరిగినా.. ఈసారి వీరి ఇద్దరి మధ్యే తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్టు జాతీయ మీడియాలో విస్తృత కథనాలు ప్రసారం అవుతున్నాయి. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సీఎం ఏక్ నాథ్ షిండే కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు షిండే కొన్ని ప్రతిపాదనలు చేయగ.. పవార్ వాటిని తీవ్రంగా వ్యతిరేకించిన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇరువురికి తీవ్ర వాగ్వాదం జరిగి.. అజిత్ పవార్ తన వర్గీయులతో బయటికి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ వార్తలపై స్పందించిన పవార్.. తనకు వేరే కార్యక్రమం ఉండటం చేత, విమాన ప్రయాణానికి ఆలస్యం అవుతోందని వచ్చేశాను అన్నారు. షిండే వర్గంతో వచ్చిన అభిప్రాయబేధాలపై ప్రశ్నించగా.. ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు.


Similar News