Spitting Into Tea : ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు సప్లయ్.. వీడియో వైరల్.. ఇద్దరు అరెస్ట్

ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ‘టీ’ Tea లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన ఉదంతం కలకలం.

Update: 2024-10-11 06:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ షాపు వద్ద ఇద్దరు యువకులు ‘టీ’ Tea లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన ఉదంతం కలకలం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీ షాప్‌లోని ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్ పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోన ముజఫర్‌నగర్‌కు చెందిన నౌషాద్, హసన్ అలీ హిమాన్షు బిష్ణోయ్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు ఆధారంగా అరెస్ట్ చేశారు.

ముస్సోరీ లైబ్రరీ చౌక్‌లో టీ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు టీ చేస్తున్న పాత్రలో పదేపదే ఉమ్మివేయడం చూసి.. వీడియో చిత్రీకరించినట్లు బిష్ణోయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కాగా, టీ లో ఉమ్మేసి కస్టమర్లకు సప్లయ్ చేస్తున్న వీడియో తాజాగా సామాజక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇలాంటి పనులు చేసే వ్యక్తులను దేహశుద్ది బాగా చేసి పోలీస్‌లకు అప్పగించాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Similar News