Jimmy Carter: అమెరికా రాజకీయాల్లో తీవ్ర విషాదం.. మాజీ అధ్యక్షుడు కన్నుమూత
అమెరికా (America) రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా (America) రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter) (100) కన్నుమూశారు. ఓ వైపు వయోభారం, తీవ్ర అనారోగ్యంతో జార్జియా (Georgia)లోని ప్లెయిన్స్ (Plains)లో కార్టర్ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు జేమ్స్ ఇ కార్టర్-3 (James E Carter-3) తెలిపారు. ఆయన మృతి పట్ల ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంతాపం ప్రకటించారు. 1924 అక్టోబర్ 1న జర్జియా (Georgia)లో జన్మించిన జమ్మీ కార్టర్ (Jimmy Carter) ఇదే ఏడాది తన 100వ పుట్టిన రోజును స్నేహితులు, బంధుమిత్రుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. 1977-1981 మధ్య కాలంలో ఆయన అమెరికాకు 39వ అధ్యక్షుడిగా పని చేశారు. 2002లో నోబెల్ శాంతి పురస్కారం (Nobel Peace Award)ని కూడా అందుకున్నారు.