Poppy Straw : 4300 కేజీల గసగసాల గడ్డి సీజ్

దిశ, నేషనల్ బ్యూరో : డ్రగ్స్‌ మాఫియాకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) షాక్ ఇచ్చింది.

Update: 2024-08-09 13:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : డ్రగ్స్‌ మాఫియాకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) షాక్ ఇచ్చింది. ఏకంగా 4,317 కేజీల గసగసాల గడ్డి (పాపీ స్ట్రా)ని తరలిస్తున్న భారీ లారీని ఎన్‌సీబీ అధికారులు సీజ్ చేశారు. దాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను జార్ఖండ్‌లోని రాంచీలో అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న గసగసాల గడ్డిని ల్యాబ్‌లో టెస్ట్ చేయించగా అది అత్యుత్తమ నాణ్యత కలిగిన ఓపియం (నల్లమందు) రకానికి చెందినదని వెల్లడైంది.

అంతకుముందు జూన్ 12న రాంచీలోనే 103.4 కేజీల ఓపియంను సీజ్ చేశారు. మే 31న జార్ఖండ్‌లోని ఖుంతి జిల్లాలో 802 కేజీల గసగసాల గడ్డిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మాఫియాను నిర్వీర్యం చేసే దిశగా తమ కసరత్తు కొనసాగుతుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News