ట్రంప్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలుగింటి అల్లుడే..!

జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి జేడీ వాన్స్ గురించి ఇంటర్నెట్ లో ఇదే పేరు హోరెత్తుతోంది. అసలు ఎవరీ వాన్స్.. ఆయనకు తెలుగు మాలాలేంది?

Update: 2024-07-16 06:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జేడీ వాన్స్ పేరును ఉపాధ్యక్షుడిగా ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి జేడీ వాన్స్ గురించి ఇంటర్నెట్ లో ఇదే పేరు హోరెత్తుతోంది. అసలు ఎవరీ వాన్స్.. ఆయనకు తెలుగు మాలాలేంది? వాన్స్ సతీమణి గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. కాగా.. వాన్స్ సతీమణి ఉషా చిలుకూరి భారతీయ మూలాలున్నవ్యక్తి కావడం విశేషం. ఆమె తల్లిదండ్రులు చాలా వేళ్ల కిందటే ఆంధ్రప్రదేశ్‌ నుంచి వలస వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి తల్లిదండ్రులది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు. కాగా.. ఉషా చిలుకూరి యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘంగా పనిచేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌, జస్టిస్‌ బ్రెట్‌ కెవానా వద్ద విధులు నిర్వర్తించారు. ఆమె యేల్‌ యూనివర్సిటీలో లా అండ్‌ టెక్‌ జర్నల్‌కు మేనేజింగ్‌ ఎడిటర్‌గా, యేల్‌ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్‌ డెవలప్‌మెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీకి గేట్స్ ఫెలోగా వెళ్లారు. అక్కడ ఆమె లెఫ్ట్‌-వింగ్‌, లిబరల్‌ గ్రూప్స్‌తో కలిసి పనిచేశారు. 2014లో ఆమె డెమోక్రాటిక్‌ పార్టీ కార్యకర్తగా నమోదు చేసుకోవడం గమనార్హం. 2015 నుంచి ఆమె న్యాయ సంబంధిత సంస్థల్లో కార్పొరేట్‌ లిటిగేటర్‌గా పనిచేస్తున్నారు.

2014లో ఉషాతో వాన్స్ వివాహం

యేల్‌ లా స్కూల్‌లోనే ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. ప్రత్యేకంగా హిందూ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకోవడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం. వాన్స్ విజయంలో ఉషా ముఖ్యమైన పాత్ర పోషించారు. రాజకీయంగా ఆయనకు అనేక అంశాల్లో అండగా నిలబడ్డారు. అత్యధికంగా అమ్ముడైన హిల్‌బిల్లీ ఎలెజీ రచనలో వాన్స్ కు ఆమె సాయంగా ఉన్నారు. ఒహాయో సెనేటర్‌గా పోటీ చేస్తున్న సమయంలో ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గత నెల ఫాక్స్‌ అండ్‌ ఫ్రెండ్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో భర్త ఉపాధ్యక్ష అభ్యర్థిత్వంపై మాట్లాడారు. "అతను ఎంత కష్టపడుతున్నాడో.. ఎంత సృజనాత్మకంగా ఉంటాడో ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. ఎల్లప్పుడూ మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తాడు" అని అన్నారు.


Similar News