Jammu and Kashmir: కుప్వారాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ లో ముష్కరుల చొరబాటు యత్నాన్ని భద్రతాబలగాలు భగ్నం చేశాయి. కుప్వారాలోని గుగల్ ధార్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Update: 2024-10-05 04:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్ లో ముష్కరుల చొరబాటు యత్నాన్ని భద్రతాబలగాలు భగ్నం చేశాయి. కుప్వారాలోని గుగల్ ధార్ ప్రాంతంలో భద్రతాబలగాలు, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతాబలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ముష్కరులు నక్కి ఉన్నారనే సమాచారంతో శుక్రవారం భద్రతాబలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. అధికారుల ఎదురుకాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

కుప్వారాలో ల్యాండ్‌మైన్ పేలుడు

శుక్రవారం కుప్వారాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఇద్దరు సైనిక సిబ్బంది గాయపడ్డారు. "ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ట్రెహ్‌గామ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ సమీపంలోని ల్యాండ్ మై పేలుడు జరిగింది. తెల్లవారుజామున జరిగిన పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు." అని అధికారులు తెలిపారు. గాయపడిన ఆర్మీ సిబ్బందిని డ్రగ్ముల్లాలోని ఆర్మీ ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.


Similar News