పవన్ కల్యాణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తమిళనాడు అడ్వకేట్ వంచినాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయనిధి స్టాలిన్ పై పవన్ చేసిన వ్యాఖ్యల్ని అడ్వకేట్ ఖండించారు.

Update: 2024-10-05 02:33 GMT

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగింది కాదు. తమిళనాడులోని మధురైలో ఓ వ్యక్తి పవన్ కల్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వంచినాథన్ అనే అడ్వకేట్ పవన్ పై కంప్లైంట్ ఇచ్చినట్లు ఓ నేషనల్ మీడియా పేర్కొంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై, మైనారిటీలపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని అడ్వకేట్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపింది. గురువారం (అక్టోబర్ 3) తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో.. పవన్ కల్యాణ్ ఉదయనిధిపై చేసిన వ్యాఖ్యల్ని అడ్వకేట్ వంచినాథన్ ఖండించినట్లు ఆ కథనం పేర్కొంది.

వారాహి సభలో పవన్.. ఉదయనిధి పేరును ప్రస్తావించకుండానే విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మం ఒక వైరస్ లాంటిదని, అలాంటి ధర్మాన్ని నాశనం చేస్తానని అన్నవారికే తాను సనాతని హిందువుని అని చెబుతున్నానని ప్రత్యేకంగా తమిళంలో ప్రసంగించారు పవన్. దాంతో ఇది ఉదయనిధిని ఉద్దేశించే చెప్పారని అందరూ భావించారు. ఈ వ్యాఖ్యలపై నిన్న స్పందించిన ఉదయనిధి స్టాలిన్.. వేచి చూడండి.. మేమేంటో చూపిస్తామని కౌంటరిచ్చారు. 


Similar News