ఖర్గే స్థానంలో జైరాం రమేశ్..ధన్ ఖడ్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

రాజ్యసభలో మరోసారి వాడి వేడీగా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మధ్య మాటల యుద్ధం సాగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుండగా..

Update: 2024-07-02 18:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యసభలో మరోసారి వాడి వేడీగా చర్చలు జరిగాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మధ్య మాటల యుద్ధం సాగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుండగా.. కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పలు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తివారీకి ధన్ ఖడ్ సూచించారు. అయితే ఇంతలోనే జైరాం రమేశ్ లేచి ఏదో చెప్పబోయాడు. దీంతో ధన్ ఖడ్ స్పందిస్తూ.. ‘జైరామ్ రమేష్ నువ్వు చాలా తెలివైనవాడివి, ప్రతిభావంతుడివి, మీరు ఖర్గే చేసిన పనినే చేస్తున్నారు. కాబట్టి ఖర్గే సీటులో కూర్చోవాలి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఖర్గే..వర్ణ వ్యవస్థ ప్రస్తావన తీసుకురావద్దని తెలిపారు. అది ఇప్పటికీ మీ మనస్సులో దాగి ఉందని తెలిపారు. అందుకే రమేష్ చాలా తెలివైన వ్యక్తి అని చెప్తున్నారు’ అని మండిపడ్డారు. ఈ పదవిని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నాకు ఇచ్చారన్నారు. అయితే ఖర్గే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ధన్ ఖడ్ బదులిచ్చారు. 

Similar News