జగన్నాథ రథయాత్ర పున:ప్రారంభం..వేలాదిగా హాజరైన భక్తులు

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. 8 రోజుల పాటు గుండిచాలో ఉంచిన తరువాత తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకురానున్నారు.

Update: 2024-07-15 14:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. 8 రోజుల పాటు గుండిచాలో ఉంచిన తరువాత తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకురానున్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి భారీగా భద్రతను మోహరించారు. భక్తులు చెక్క గుర్రాలతో అలంకరించబడిన ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రథాలను ఆలయ పట్టణం పూరీ గుండా తాళ్లతో లాగనున్నారు. రథయాత్ర సందర్భంగా కళాకారులు ఒడిస్సీ, కూచిపూడి, కథక్ నృత్యాలతో అలరించారు. వుడు, దుర్గ, కాళి, హనుమంతుని వేషధారణలతో నృత్యాలు చేశారు. జిల్లా పరిపాలన, అగ్నిమాపక సేవలు, ఇండియా రిజర్వ్ బెటాలియన్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ నుండి 10,000 మంది సిబ్బందిని పూరీ అంతటా మోహరించారు. మరోవైపు జగన్నాథ ఆలయంలో రత్న భండార్ ను ఆదివారం తెరచిన విషయం తెలిసిందే. ఒడిశా హైకోర్ట్ జడ్జి బిశ్వనాథ్ రాత్ పర్యవేక్షణలో 11 మంది సభ్యుల ప్రత్యేక బృందం రత్న భాండాగారంలోని గదిని తెరిచి అందులోని నగలను బయటకు తీసుకొచ్చారు. అయితే లోపల పాములు ఉన్నాయన్న ఆరోపణలను న్యాయమూర్తి రాత్ తిరస్కరించారు. అక్కడ అటువంటివి ఏమీ లేవని తెలిపారు. 

Tags:    

Similar News