మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరైన Jacqueline Fernandez
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి విచారణకు హజరయ్యారు.
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరోసారి విచారణకు హజరయ్యారు. ఈ కేసుల ఇప్పటికే అరెస్టైన కన్మాన్ చంద్ర శేఖర్‌తో సంబంధాలపై ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ దర్యాప్తు చేపట్టింది. మందిర్ మార్గ్‌లోని కార్యాలయంలో జాక్వెలిన్ విచారణలో పాల్గొందని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. గత బుధవారం దాదాపు 8 గంటల పాటు జాక్వెలిన్‌ను, పింకీ ఇరానీని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. కాగా, దర్యాప్తులో ఫెర్నాండ్ ఏజెంట్ ప్రశాంత్‌కు కూడా చంద్రశేఖర్ బహుమతిగా బైక్‌ను ఇవ్వచూపగా, నిరాకరించాడని తేలింది.
అయితే ప్రశాంత్ ఇంటివద్దనే టూవీలర్‌ను చంద్రశేఖర్ వదిలిపెట్టగా, పోలీసులు దానిని స్వాధీనం చేసుకున్నారు. చంద్రశేఖర్ జాక్వెలిన్‌కు విలువైన బహుమతులు, బ్యాగులు అందజేశారు. అయితే వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అతడి గురించి వాస్తవాలు తెలిసి దూరంగా ఉంటున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఇదే కేసులో మరో నటి నోరా ఫతేహిని కూడా పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.