ఇంగ్లీష్ చానెల్‌ను ఈది మొదటి ఇండియన్ మదర్‌గా రికార్డ్!.. 42 కి.మీల దూరం 17 గంటల్లో పూర్తి

ప్రపంచంలోని అత్యంత కఠినమైన స్విమ్మింగ్ సవాళ్లలో ఒకటైన ఇంగ్లీష్ ఛానెల్ ను మహారాష్ట్రకు చెందిన తన్వీ విజయవంతంగా దాటింది.

Update: 2024-07-02 07:50 GMT

దిశ. డైనమిక్ బ్యూరో: ప్రపంచంలోని అత్యంత కఠినమైన స్విమ్మింగ్ సవాళ్లలో ఒకటైన ఇంగ్లీష్ ఛానెల్ ను మహారాష్ట్రకు చెందిన తన్వీ విజయవంతంగా దాటింది. దీంతో ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదిన మొదటి ఇండియన్ మదర్ గా రికార్డు కెక్కింది. నాసిక్ కు చెందిన తన్వీ చవాన్ డియోర్ ఇద్దరు కవల పిల్లలకు తల్లి. ఆమె రెండేళ్ల క్రితం కఠినమైన శిక్షణతో స్మిమ్మింగ్ ప్రయాణం మొదలుపెట్టింది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రతిరోజూ 8 నుంచి 10 గంటలు ప్రాక్టీస్ చేస్తూ తనని తాను సిద్దం చేసుకుంది. వివిధ వాతావరణ పరిస్థితులకు తన శరీరాన్ని అలవాటు చేసేందుకు భారతదేశం అంతటా ప్రయాణించింది. శిక్షణ అనంతరం అత్యంత కఠినమైన ఇంగ్లీష్ ఛానెల్ ను ఈదే సవాళుకు సిద్దమైంది.

యూకేలోని డోవర్ నుంచి మొదలుపెట్టి ఫ్రెంచ్ తీరం వరకు 42 కి.మీల దూరాన్ని 17 గంటల42 నిమిషాల్లో పూర్తి చేసి తన్వీ ఈ అపురూపమైన ఫీట్ ను సాధించింది. ఇంత గొప్ప మైలురాయిని సాధించిన ఏకైక భారతీయ తల్లిగా ఆమె నిలిచింది. ఈ ఫీట్ ను సాధించడంలో ఆమె కోచ్ శ్రీకాంత్ విశ్వనాథన్, యూకే నుంచి తోటి స్విమ్మర్ అయిన రెజినాల్డ్ మద్దతు మరియు ప్రోత్సాహాం కీలకంగా మారాయని తన్వీ చెప్పింది. ఇంగ్లీష్ ఛానల్, దాని కఠినమైన పరిస్థితులు మరియు జెల్లీ ఫిష్ విభిన్న జాతి జీవులు ఆమె స్థితిస్థాపకతను పరీక్షించాయిని. అనేక జెల్లీ ఫిష్‌లు కుట్టినప్పటికి, 16-డిగ్రీల చల్లటి నీళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపింది. అలాగే శక్తివంతమైన ఆటుపోట్లు, ప్రవాహాలు ఆమెను దాదాపు మూడు గంటల పాటు చిక్కుకునేలా చేశాయని, కానీ ఆమె రెస్క్యూ టీమ్ నుండి వచ్చిన చీర్స్ మరియు మద్దతు తన ప్రయాణాన్ని ముందుకు నడిపించాయని తన్వీ వెల్లడించింది.  

Similar News