Israel: ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ దాడి..20 మంది పాలస్తీనియన్లు మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ వైమాణిక దాడి చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియా(Middle East)లో ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఉత్తర గాజా(Northrrn Gaza)లో ఇజ్రాయెల్(Israel) వైమాణిక దాడి (Missile Attack) చేసింది. ఇజ్రాయెల్ సరిహద్దుకు సమీపంలోని బీట్ లాహియా(Beet Lahiya) పట్టణంలో యుద్ధం వల్ల నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందుతున్న ఓ ఇంటిపై అటాక్ చేసింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, ఆరుగురు పిల్లలు ఉన్నట్టు వెల్లడించారు. ఆ ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు(Hamas Terrasists) ఉన్నారనే సమాచారంతో ఇజ్రాయెల్ అటాక్ చేసినట్టు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించ లేదు. అంతకు ముందు బీట్ లాహియా, సమీపంలోని బీట్ హనౌన్ పట్టణం, జబాలియా శరణార్థి శిబిరాన్ని పూర్తిగా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. అంతేగాక ఒక నెలకు పైగా ఆ ప్రాంతంలోకి దాదాపు ఎటువంటి మానవతా సహాయాన్ని అనుమతించలేదు. కాగా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు 43000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.