,న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే వేడుకల్లో మొదటి రాఫెల్ పైలట్ శివాని సింగ్ ప్రత్యేకంగా నిలిచారు. భారత వాయుసేన భవిష్యత్తు తరాల కోసం పరివర్తన థీమ్ భారత వాయు సేన శకటాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రదర్శించింది. ఈ ప్రదర్శనలో ఇతర పైలట్‌లతో పాటు శివాని పరేడ్‌లో పాల్గొన్నారు. కాగా, మొత్తంగా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొన్న రెండో మహిళ పైలట్ శివాని కావడం విశేషం.
వారణాసికి చెందిన శివాని సింగ్ 2017లో వాయుసేనలో చేరారు. రఫెల్ కన్నా ముందు ఎంఐజీ-21 బైసన్ విమానంకు ఫైలట్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం పంజాబ్‌లోని అంబాలాకు చెందిన గోల్డెన్ యారోస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది లెఫ్టినెంట్ భవ్నా కాంత్ ఐఏఎఫ్ శకట ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గౌరవ వందనం స్వీకరించారు.