Raghav Chadha: సోమాలియా లాంటి సేవల కోసం ఇంగ్లాండ్ తరహా పన్నులు కట్టాలి

కేంద్ర బడ్జెట్(Union Budget) పై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా విమార్శలు గుప్పించారు.

Update: 2024-07-26 04:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్(Union Budget) పై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా విమార్శలు గుప్పించారు. దేశ పౌరులు సోమాలియా లాంటి సౌకర్యాలు పొందేందుకు ఇంగ్లాండ్ తరహా పన్నులు చెల్లించాలని ఎద్దేవా చేశారు. సామాన్యుడు రూ. 10 సంపాదిస్తే.. రూ.7-8 వరకు పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాడని రాఘవ్ చడ్డా(Raghav Chadha) ఉదాహరణ వివరించారు. మిగితా డబ్బులతో ఎలా బతుకుతాడని ప్రశ్నించారు. ఈసారి బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను ప్రభుత్వం అసంతృప్తికి గురిచేస్తోందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సమాజంలోని కనీసం కొన్ని వర్గాలైనా సంతోషంగా ఉంటాయని, కొందరు నిరాశ చెందుతారని గుర్తుచేశారు. కానీ, ఈసారి బడ్జెట్ అందర్నీ అసంతృప్తికి గురిచేసిందన్నారు. వాస్తవానికి బీజేపీ(BJP) మద్దతుదారులు కూడా బడ్జెట్ వల్ల నిరాశ చెందారని పేర్కొన్నారు. గత పదేళ్లలో ప్రభత్వం భారీగా పన్నుల విధించడం వల్ల సామాన్యులపై తీవ్ర భారం మోపిందన్నారు.

బీజేపీ వైఫల్యానికి కారణాలివే..

బీజేపీకి 240 సీట్లు రావడంపైనా రాఘవ్ చడ్డా చురకలు అంటించారు. ఈసారి ప్రజలు కమలపార్టీపై ప్రజలు 18 శాతం జీఎస్టీ విధించారని పేర్కొన్నారు. మత, కులతత్వ విధానాలే వారి వైఫల్యానికి కారణమని అన్నారు. టికెట్ పంపిణీలోనీ కాషాయపార్టీ ఫెయిల్ అయ్యిందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ(Economy) కూడా మరోకారణమన్నారు. గ్రామీణ ఆదాయం(Rural Income), ద్రవ్యోల్బణం(Inflation), నిరుద్యోగం(unemployment) కూడా దేశంలో అతి పెద్ద సమస్యలుగా మారాయన్నారు. దేశ జనాభాలో దాదాపు 60 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారని.. గ్రామీణ ఆదాయ వృద్ధి దశాబ్ద కనిష్ఠ స్థాయికి చేరుకుందన్నారు. రైతుల ఆదాయాన్ని, కనీస మద్దతు ధరలను రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఏ పనీ చేయలేకపోయిందన్నారు. గత 25 నెలలుగా గ్రామీణ ఆదాయం తగ్గుముఖం పట్టిందన్నారు. యూపీఏ హయాంలో గ్రామీణ వేతన ఆదాయం 7 శాతానికి పెరిగిందని గుర్తుచేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక.. 2014లో అది కాస్తా 3 శాతానికి చేరగా.. 2019లో 2.6 శాతానికి పడిపోయిందన్నారు. గోధుమపిండి నుంచి పాలు, పెరుగు ఇలా అన్నింటికి ధఱలు పెరిగిపోయాయన్నారు. ఆహార ద్రవ్యోల్బణం 9 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఎగుమతి చేసే వస్తువులకు ధరలు ఎలా పెరిగాయి? దానివల్ల రైతులకు ఎందుకు ప్రయోజనం లేదు? అని ప్రశ్నించారు. సిఎంఐ నివేదిక ప్రకారం.. అసంఘటిత రంగంలో నిరుద్యోగం రేటు 9 శాతం ఉందన్నారు. సంఘటిత రంగంలో 9.2 శాతంగా ఉందని పేర్కొన్నారు. దేశంలోని యువతకోసం ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.


Similar News