ఇండియన్ వాటర్ రైల్వేస్..!.. ముంబైలో నీళ్లలో నడుస్తున్న రైలు

సాదరణంగా రైళ్లు రైలు పట్టాలపై నడుస్తాయి. బొమ్మ రైళ్లు అయితే నేలపై కూడా నడుస్తాయి కానీ నీళ్లలో రైళ్లు నడుస్తున్న విచిత్ర సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Update: 2024-07-08 11:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సాదరణంగా రైళ్లు రైలు పట్టాలపై నడుస్తాయి. బొమ్మ రైళ్లు అయితే నేలపై కూడా నడుస్తాయి కానీ నీళ్లలో రైళ్లు నడుస్తున్న విచిత్ర సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలో నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వరద రోడ్లపైనే కాక రైలు పట్టాలపై కూడా చేరింది. భారీ వరదల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో పాటు పలు రైళ్లు, విమాన సర్వీసులు సైతం రద్దు చేశారు. అయితే ముంబైలోని స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా లోకల్ సర్వీసులను కొద్దిసేపు నడిపించాలని నిర్ణయించారు. ఈ వరద చేరిన పట్టాలపైనే లోకల్ సర్వీసులను నెమ్మదిగా నడిపించారు. నీళ్లు నిలిచిన పట్టాలపై ప్రయాణిస్తున్న రైలులో ఉన్న ప్రయాణికులు భయంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బయటకి చూస్తున్నారు. ఈ విచిత్ర సంఘటనను కొందరు తమ ఫోన్లలో బందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. వాటర్ లోకల్ ట్రైన్ ఇండియాలో చేయబడింది అని, ఇండియన్ వాటర్ రైల్వే అని పలు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


Similar News