Indian Railways : రైల్వేశాఖ సంచలన నిర్ణయం..

ప్రపంచంలోనే భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో అతిపెద్ద నెట్ వర్క్ .

Update: 2024-08-08 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే భారతీయ రైల్వే వ్యవస్థ నాలుగో అతిపెద్ద నెట్ వర్క్ . దేశంలో తక్కువ ఖర్చుతో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా వెళ్ళడానికి భారతీయ రైల్వేలు మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ప్రతి రోజు కొన్ని కోట్ల మంది రైళ్లల్లో ప్రయణిస్తున్నారు. దీని ద్వారా రైల్వే శాఖకు రోజుకి కొన్ని కోట్ల వరకు ఆదాయం వస్తోంది.ఈ క్రమంలో.. దేశ సేవలో ప్రాణాలు అర్పిస్తున్న సైనికులను సన్మానించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

అయితే .. భారత రైల్వేశాఖ ఈ మధ్య డీజిల్ ఇంజిన్లను పునరుద్దిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతనంగా తీసుకొచ్చే ఇంజిన్లపై అమరవీరుల పేర్లను వాటిపై రాయనుంది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు గుర్తుగా , వారికి నివాళులు అర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వే శాఖ గురువారం 'X' వేదికగా ఒక వీడియో షేర్ చేసింది.రైల్వే శాఖ నూతన ఇంజిన్లపై అమరవీరుల పేర్లను రాసిన ఫోటో, వీడియో ను కూడా షేర్ చేసింది.కాగా.. రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై అమరవీరుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  


Similar News