ఎవరెస్టుపై ఈ సీజన్‌లో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య

భారతీయ పర్వతారోహకుడైన బాన్షీలాల్(46) గతవారం ఎవరెస్టు మార్గంలో చిక్కుకున్నాడు.

Update: 2024-05-28 12:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్టుకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదే సమయంలో అక్కడి ప్రతికూల వాతావరణం, పరిస్థితులు, అనారోగ్యం కారణంగా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా పర్వతారోహణ చేసే సమయంలో ఆరోగ్యం క్షీణించి చికిత్స పొందుతున్న ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయినట్టు నేపాలీ టూరిజం అధికారి తెలిపారు. దీంతో ఈ సీజన్‌లో ఎవరెస్టుపై ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారని ఆయన వెల్లడించారు. భారతీయ పర్వతారోహకుడైన బాన్షీలాల్(46) గతవారం ఎవరెస్టు మార్గంలో చిక్కుకున్నాడు. ఆ తర్వాత రెస్క్యూ సిబ్బంది అతడిని కాపాడి కాట్మండూ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాన్షీలాల్ మరణించినట్టు నేపాల్ టూరిజం శాఖ ప్రకటించింది. ఇటీవల బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి, మరో ఇద్దరు నేపాలీ గైడ్లు కూడా తప్పిపోయారు. వారు కూడా మరణించినట్టుగానే భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో గతంలో కంటే ఈసారి మృతుల సంఖ్య తగ్గాయని, 2023లో 18 మంది ఎవరెస్టు మార్గంలో మరణించినట్టు వారు పేర్కొంటున్నారు. చాలావరకు ఎవరెస్టు పర్వతారోహణ చేస్తూ సంభవించిన మరణాలు 8,000 మీటర్ల ఎత్తులోనే జరిగాయి. ఈ ప్రాంతాన్ని సాధారణంగా డెత్ జోన్‌గా పరిగణిస్తారు. ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం, వాతావరణ అనుకూలంగా లేకపోవడం వల్ల ఎక్కువమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. 

Tags:    

Similar News