చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్
చత్తీస్గడ్ సుకుమా జిల్లా బందర్‌పదర్, కుర్రాజ్‌గూడ ప్రాంతాల్లో నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోలు మృతి చెందారు.
దిశ, భద్రాచలం : చత్తీస్గడ్ సుకుమా జిల్లా బందర్‌పదర్, కుర్రాజ్‌గూడ ప్రాంతాల్లో నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోలు మృతి చెందారు. ఇందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతి చెందిన మావోలలో ఆరుగురు మావోయిస్టులను పోలీస్ అధికారులు గుర్తించారు. ఇంకా నలుగురు మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.
గుర్తించిన ఆరుగురు మావోయిస్టులపై రూ. 21 లక్షల రివార్డ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుధి మాసా, డీవీసీఎం, మాద్వి లక్మా, ఏసీఎం, డోరో కోసి ఏసీఎం, కుంజమ్ బమన్, కాటం కోస పీఎల్ జీ ఏ కంపెనీ 8 కమాండర్, దుధి హంగీ ఉన్నారు. హంగీ దుధి మాసా భార్య అని తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఏకే 47-1, ఎస్ ఎల్ ఆర్ -1, ఇన్సాస్ -1, సింగిల్ షాట్ గన్ -1, పిస్టల్ -1 లభ్యం అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది.