Predator drones: భారత్, అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం

భారత్, అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై ఒప్పందం జరగనుంది. సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి అమెరికా నుంచి భారత్ 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయనుంది.

Update: 2024-10-15 04:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, అమెరికా మధ్య ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుపై ఒప్పందం జరగనుంది. సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను పెంపొందించడానికి అమెరికా నుంచి భారత్ 31 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. వాటి నిర్వహణ, మరమ్మతు, సమగ్ర ఏర్పాటు కోసం రూ.32 వేల కోట్ల ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఈ ఫారిన్ మిలిటరీ సేల్స్ ఒప్పందం మంగళవారం జరగనున్నట్లు రక్షణ శాఖకు చెందిన అధికారులు తెలిపారు. ఈ కాంట్రాక్టుల కోసం అమెరికన్ బృందం భారత్ కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రక్షణశాఖ ఉన్నతాధికారులు ఈ సంతకాల కార్యక్రమానికి హాజరుకానున్నారు.

భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ ఆమోదం

ఇకపోతే, భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ గత వారం 31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి ఆమోదం తెలిపింది. వాటిలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు. అయితే, అమెరికాతో ఒప్పందంపై భారత్ చాలా ఏళ్లుగా చర్చిస్తోంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఒప్పందం జరగలేకపోయింది. కొన్నివారాల క్రితం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో చివరి అడ్డంకులు క్లియర్ అయ్యాయి. దీంతో, ఒప్పందం ముందుకు సాగింది.


Similar News