ఇండియా టూర్ సక్సెస్..మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిమిత్తం తొలిసారి భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక ప్రకటన చేశారు.

Update: 2024-06-12 05:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిమిత్తం తొలిసారి భారత్‌కు వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక ప్రకటన చేశారు. ఇండియా పర్యటన విజయవంతమైందని తెలిపారు. ఈ టూర్ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. దేవుడు ఇష్టపడితే భారత్-మాల్దీవులు ఒకే విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కాగా, ముయిజ్జు చైనా అనుకూల నాయకుడిగా పేరు పొందిన విషయం తెలిసిందే.

ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అయినప్పటికీ భారత్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే భారత్‌కు వచ్చిన ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌లతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌-మాల్దీవుల మధ్య సంబంధాలను పునరుద్ధరించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 


Similar News