Economic Survey: పెరుగుతోన్న శ్రామిక శక్తి

దేశంలో శ్రామిక శక్తి క్రమంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే తేల్చింది. గత ఆరేళ్లుగా భారతదేశ మహిళా శ్రామిక శక్తి(Female labour force) భాగస్వామ్యం పెరుగుతోందని పేర్కొంది.

Update: 2024-07-22 10:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో శ్రామిక శక్తి క్రమంగా పెరుగుతోందని ఆర్థిక సర్వే తేల్చింది. గత ఆరేళ్లుగా భారతదేశ మహిళా శ్రామిక శక్తి(Female labour force) భాగస్వామ్యం పెరుగుతోందని పేర్కొంది. నిరుద్యోగ(Unemployment) రేటు తగ్గుముఖం పట్టిందని.. 3.2కి పడిపోయిందంది. గత ఆరేళ్లలో భారతీయ కార్మిక మార్కెట్(Indian labour market) సూచికల్లో మెరుగుదలను ఆర్థిక సర్వే హైలైట్ చేసింది. అవసరాలకు అనుగుణంగా వ్యవసాయేతర రంగంలో ఉపాధి కల్పన జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 2030 నాటికి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి అవసరమందంది. పనిచేసే సామర్థ్యం ఉన్నవారందరికీ ఉద్యోగాలు అవసరం లేదని.. కొంతమంది ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉంటారంది. కొందరు స్వయం ఉపాధి పొందే ఛాన్స్ ఉందంది. శ్రామిక శక్తి దాదాపు 56.5 కోట్లుగా ఉందంది. వ్యవసాయం రంగంలో 45 శాతానికి పైగా, తయారీ రంగంలో 11.4 శాతం, సేవలలో 28.9 శాతం, నిర్మాణ రంగంలో 13 శాతంగా ఉందంది.

2047 నాటికి తగ్గనున్న శ్రామిక జనాభా

2023 నాటికి వ్యవసాయ రంగంలో శ్రామిక జనాభా 45.8 శాతంగా ఉన్నట్లు సర్వే (Economic Survey) పేర్కొంది. 2047 నాటికి ఇది 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలు, ముద్ర, మిత్ర టెక్స్‌లైట్‌ వంటి పథకాలను మరింత పటిష్ఠం చేయాలంది. దీని ద్వారా వచ్చే ఐదేళ్లలో వ్యవసాయేతర రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది. దీనివల్ల కార్మిక శక్తిని సంఘటిత రంగంలోకి తీసుకురావాలన్న చిరకల లక్ష్యం కూడ నెరవేరుతోందంది. భూచట్టలు సహ ఇతర నిబంధనలు సడలించాలంది. దీంతో, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపాధి అవకశాలు పెంచేలా కుదురుతుందంది. దీని వల్ల వరికి సామాజిక భద్రత పథకాలను విస్తరించవచ్చంది. వివిధ నైపుణ్యాలకు చెందిన ఉద్యోగాలపై కృత్రిమ మేధ ప్రభావం తీవ్రంగ ఉంటుందని తెలుస్తోందంది. అయితే, ఈ ఏఐ వల్ల ఆవిష్కరణలు పెరిగే అవకాశం ఉందంది. దాని వల్ల పని విధానాల్లో మర్పులు వస్తాయంది. అన్ని రంగల్లో ఆటోమేషన్ రాబోతోందని తెలిపింది. సృజనాత్మక రంగంలో ఏఐ సాధనాల వినియోగం పెరుగుతుందని పేర్కొంది.


Similar News