భారీ వర్షంలో నడుస్తూ వెళ్లి.. రైతులతో ముచ్చటించిన ప్రధాని మోడీ

అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ముందున్న లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Update: 2024-08-12 07:18 GMT

దిశ, వెబ్ డెస్క్: అన్నదాతల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ముందున్న లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ICAR) కి వెళ్లిన మోదీ ఈ వ్యాఖ్యలను చేశారు. వ్యవసాయానికి సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు. అన్నదాతలకు ఎక్కువ లాభాన్ని సమకూర్చే 109 రకాల నూతన వంగడాలను ఆదివారం మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మోదీ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. వ్యవసాయంలో రైతుల ఆదాయం, ఉత్పాదకతను పెంచటమే లక్ష్యంగా ఈ నూతన వంగడ విత్తనాలను విడుదల చేసినట్లు తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి నినాదం 'జై జవాన్ జై కిసాన్' తో పాటు వాజ్ పేయ్ నినాదం అయిన 'జై విజ్ఞాన్' ను కూడా ఆయన గుర్తు చేశారు. రీసెర్చ్, ఇన్నోవేషన్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ నినాదాలకు అదనంగా 'జై అనుసంధాన్' ను కూడా జోడించాలని సూచించారు.

అయితే ప్రధాని మోదీ అక్కడ రైతులతో ముచ్చటించే క్రమంలో.. ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఈవెంట్ లో రైతులతో మాట్లాడేందుకు ప్రధాని వెళ్ళినప్పుడు భారీ వర్షం కురిసింది. దాంతో అధికారులు ఇంటరాక్షన్ ను రద్దు చేయాలని ప్రధానిని కోరగా.. వర్షం ఉన్నా సరే తాను రైతులతో ముచ్చటిస్తానని పట్టుబట్టారు. అయితే వర్షంలో గొడుగును పట్టుకొని సెక్యూరిటీ వస్తే, ఆ గొడుగుని తానే పట్టుకుంటానని సెక్యూరిటీకి చెప్పారు ప్రధాని మోదీ. అంతేకాకుండా రైతులతో ముచ్చటించే సమయంలో రైతులకు కూడా మోదీనే గొడుగు పట్టడంతో.. మోదీ సింప్లిసిటీ ని ఇప్పుడు అందరూ అభినందిస్తున్నారు. 


Similar News