ఏఐకు సిద్ధంగా ఉన్న ఐఎంఎఫ్ జాబితాలో భారత్

ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంసిద్ధతను కలిగి ఉన్న 174 దేశాల నుంచి ఐఎంఎఫ్ వివరాలను సేకరించింది.

Update: 2024-06-27 17:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఈ) ప్రిపేర్‌డ్‌నెస్ ఇండెక్స్(ఏఐపీఐ) డాష్‌బోర్డ్‌ను తాజగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ సంసిద్ధతను కలిగి ఉన్న 174 దేశాల నుంచి ఐఎంఎఫ్ వివరాలను సేకరించింది. అందులో ప్రతి దేశాన్ని అడ్వాన్స్‌డ్ ఎకానమీ, ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ, తక్కువ-ఆదాయ దేశాలుగా వర్గీకరించింది. సింగపూర్(0.80), డెన్మార్క్(0.78), యూఎస్(0.77) అత్యధిక రేటింగ్‌తో అడ్వాన్స్‌డ్ ఎకానమీ జాబితాలో ఉన్నాయి. భారత్ 0.49 రేటింగ్‌తో ఎమర్జింగ్ ఎకానమీ జాబితాలో ఉంది. మొత్తం 174 దేశాల్లో భారత్ 72వ స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్(0.38 రేటింగ్) 113, శ్రీలంక 92(0.43 రేటింగ్), చైనా(0.63 రేటింగ్) 31వ ర్యాంకును సాధించాయి. డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ కేపిటల్, లేబర్ మార్కెట్ పాలసీలు, ఇన్నోవేషన్, ఎకనమిక్ ఇంటిగ్రేషన్, రెగ్యులేషన్ అనే నాలుగు కీలక రంగాల్లో అంచనా వేయడం ఆధారంగా ప్రతి దేశానికి ఐఎంఎఫ్ రేటింగ్ ఇచ్చింది. ఏఈ కారనంగా అడ్వాన్స్‌డ్ ఎకానమీలో 33 శాతం, ఎమర్జింగ్ ఎకానమీలో 24 శాతం, తక్కువ ఆదాయ ఎకానమీలో 18 శాతం దేశాల్లో ఉద్యోగాలు ప్రమాదంలో పడొచ్చని అంచనా. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ఏఐ కారణంగా ప్రభావితం కానున్నాయి.  


Similar News