IMD: రానున్న 5 రోజుల పాటు ఏపీలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు: ఐఎండీ

రాబోయే ఐదు రోజుల్లో 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు

Update: 2024-08-01 15:00 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆగష్టు 1-5 తేదీల మధ్య ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావారణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. గురువారం నాటి ప్రకటనలో ఐఎండీ ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల్లో 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ, యానాం మీదుగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్ర డైరెక్టర్ స్టెల్లా సాముల్ చెప్పారు. అంతకుముందు ఏపీలోని తూర్పు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ కమిటీ(ఏపీఎస్‌డీఎంఏ) అంచనా వేసింది. ఏపీతో పాటు కోస్టల్ కర్ణాటక, లక్షద్వీప్, కేరళ, మహేలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్టల్ ఆంధ్ర, యానాం, తెలంగాణలలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. 

Tags:    

Similar News