మహిళల పట్ల ఆలోచన మార్చుకోండి.. మోదీ కీలక సూచనలు

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ 76 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు..

Update: 2022-08-15 03:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత దేశ 76 స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం దేశాన్ని, ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోడీ ఎన్నో విషయాలను పంచుకున్నారు. దేశానికి సంబంధించి 5 ముఖ్య తీర్మానాలు చేశారు. వాటితో పాటుగా దేశ ప్రజలను తాను కోరుకునేది ఒక్కటేనని మోదీ తెలిపారు. 'భారత ప్రజలను నేను కోరుకునేది ఒకే ఒక్కటే. నిత్యజీవితంలో మహిళల పట్ల మనకున్న మనస్తత్వాన్ని మార్చుకోగలమా?' అని అడిగారు. అంతేకాకుండా భారత దేశ అభివృద్ధిలో మహిళల పట్ల గౌరవ భావం మూల స్తంభంలా ఉంటుందని, దేశ కలలను సాకారం చేసుకోవడంలో కూడా మహిళలపై మన చూపే గౌరవం ముఖ్య పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పుకొచ్చారు.

రాబోయే 25 సంవత్సరాలకు దేశం కోసం 5 తీర్మానాలు: ప్రధాని మోడీ 

భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన నినాదాలు.. 


Similar News