ఇళయరాజాను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది: ఫ్రధాని మోడీ

సంగీత దర్శకుడు ఇళయరాజా ( Ilayaraja)ను కలవడం నాకు చాలా ఆనందంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) ట్వీట్ చేశారు.

Update: 2025-03-19 03:22 GMT
ఇళయరాజాను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది: ఫ్రధాని మోడీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సంగీత దర్శకుడు ఇళయరాజా ( Ilayaraja)ను కలవడం నాకు చాలా ఆనందంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనతో భేటీ అనంతరం ప్రధాని తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు. "రాజ్యసభ పార్లమెంటు సభ్యుడు ఇళయరాజాను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. సంగీతకారుడిగా ఆయన ప్రతిభ మన సంగీతం, సంస్కృతిపై అపారమైన ప్రభావాన్ని చూపింది.

అన్ని విధాలుగా మార్గదర్శకుడైన ఆయన కొన్ని రోజుల క్రితం లండన్‌లో తన మొదటి పాశ్చాత్య శాస్త్రీయ సింఫొనీ వాలియంట్‌ (first Western classical symphony, Valiant)ను ప్రదర్శించడం ద్వారా మళ్ళీ చరిత్ర సృష్టించారు. ప్రపంచ ప్రఖ్యాత రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా (world-famous Royal Philharmonic Orchestra) తో ఈ ప్రదర్శన జరిగింది. ఈ ముఖ్యమైన విజయం ఆయన అసమానమైన సంగీత ప్రయాణంలో మరో అధ్యాయాన్ని సూచిస్తుంది - ఇది ప్రపంచ స్థాయిలో రాణిస్తూనే ఉంది." అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు.

Tags:    

Similar News