Bangladesh Crisis: హిందువులపై దాడులు ఆపాలి.. రోడ్డెక్కిన ఇండో అమెరికన్లు

బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలపై దాడులు ఆపాలని అమెరికాలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Update: 2024-08-12 04:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లోని హిందువులు, మైనారిటీలపై దాడులు ఆపాలని అమెరికాలో భారీ ర్యాలీ నిర్వహించారు. హ్యూస్టన్ లో 300 మంది భారతీయ అమెరికన్లు, బంగ్లాదేశీలు భారీ ర్యాలీ చేశారు. మైత్రి, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా, హిందూయాక్షన్, హిందూప్యాక్ట్, హ్యూస్టన్ దుర్గాబారి సొసైటీ, ఇస్కాన్‌తో సహా హ్యూస్టన్ లోని హిందూ సమూహాలు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.”బంగ్లాదేశ్ లోని హిందువులను కాపాడండి” అనే పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు.

బైడెన్ కు వినతి

బంగ్లాదేశ్‌లోని మైనారిటీ కమ్యూనిటీలను రక్షించడానికి, దాడులు నివారించడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్యల తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కోరారు. బంగ్లాదేశ్ లో శాంతి కోసం అత్యవసరమైన చర్య తీసుకోవాలన్నారు. మానవాళికి వ్యతిరేకంగా ఘోరమైన నేరాలు బయటపడుతున్నప్పుడు అమెరికా ప్రభుత్వం ఇంకా మౌనం పాటించడం సరికాదన్నారు. చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ హిందువులను అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని పర్యవేక్షించడంలో ఐక్యంగా ఉండాలని కోరారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సమిష్టిగా అవసరమైన చొరవలను తీసుకోవాలని ప్రోత్సహించారు.


Similar News