CJI : ఆలిండియా రేడియోలో ప్రజెంటర్‌గా పనిచేశా : సీజేఐ డీవై చంద్రచూడ్

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) నవంబరు 10న రిటైర్ కాబోతున్నారు.

Update: 2024-10-26 13:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI DY Chandrachud) నవంబరు 10న రిటైర్ కాబోతున్నారు. ఈసందర్భంగా ‘ఆలిండియా రేడియో’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కెరీర్‌తో ముడిపడిన పలు ఆసక్తికర వివరాలను ఆయన వెల్లడించారు. తల్లి శాస్త్రీయ సంగీతకారిణి కావడంతో సహజంగానే తనకు కూడా సంగీతంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెరిగిందన్నారు. స్కూల్ డేస్‌లో తరుచుగా తన తల్లితో కలిసి ముంబైలోని ఆలిండియా రేడియో(All India Radio) స్టూడియోకు వెళ్లేవాడినని సీజేఐ(CJI) తెలిపారు. ‘‘మా కుటుంబం ముంబై నుంచి ఢిల్లీకి మారిన తర్వాత.. 1975లో ఢిల్లీ ఆకాశవాణిలో ప్రజెంటర్‌ జాబ్స్ భర్తీ చేస్తున్నారని తెలిసింది. దీంతో నేను వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. ఇంగ్లిష్, హిందీలపై నాకున్న పట్టును చూసి ఉద్యోగమిచ్చారు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.

‘‘ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ షోలకు నేను చాలా నెలల పాటు ప్రజెంటర్‌గా వ్యవహరించాను. అయితే ఫస్ట్ చేసిన ప్రోగ్రాం వివరాలన్నీ ఇప్పటికీ బాగా గుర్తున్నాయి’’ అని సీజేఐ చెప్పారు. పాశ్చాత్య సంగీతంపై తాను ఢిల్లీ ఆలిండియా రేడియోలో నడిపిన ఒక షోకు శ్రోతల నుంచి మంచి క్రేజ్ వచ్చిందన్నారు. ఆనాడు ఆలిండియా రేడియోలో న్యూస్ చదివిన ఎంతోమంది ప్రముఖ ప్రజెంటర్ల కంచు కంఠాలు తనకు గుర్తుండిపోయాయని సీజేఐ తెలిపారు. స్కూల్ డేస్‌లో ఆలిండియా రేడియోలో హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం న్యూస్‌లను తరుచుగా వినేవాడినన్నారు. ఇక న్యాయవాద ప్రొఫెషన్ గురించి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. యువ లాయర్లకు తగిన విధంగా శాలరీలను చెల్లించడాన్ని సీనియర్ లాయర్లు అలవాటుగా మార్చుకోవాలన్నారు. తొలి రెండు, మూడేళ్లు అనేవి ప్రతీ లాయర్‌కు కెరీర్‌లో చాలా కీలకమైన అంశమని చెప్పారు. లాయర్‌గా మారిన మొదటి నెల నుంచే భారీగా సంపాదించడం సాధ్యమయ్యే విషయం కాదన్నారు.

Tags:    

Similar News