ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్

ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లా కొహక మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది, కుర్రేవాయ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

Update: 2024-07-02 13:43 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ జిల్లా కొహక మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధనంది, కుర్రేవాయ గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మావోలు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. ఎస్ టీ ఎఫ్, డీ ఆర్ జీ, బీ ఎస్ ఎఫ్, ఐ టీ బీ పీకి చెందిన మొత్తం 1400 మంది భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టారు. కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య భారీగా పెరుగుతుందని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. 

Similar News