ప్రజలను మభ్యపెట్టి ఎంత కాలం అధికారంలో ఉంటారు ?

ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి నిరంతరం మోడీ ప్రస్తావిస్తూనే ఉన్నారని అన్నారు.

Update: 2024-06-24 17:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఎమర్జెన్సీపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఫైర్ అయ్యారు. ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల క్రితం విధించిన ఎమర్జెన్సీ గురించి నిరంతరం మోడీ ప్రస్తావిస్తూనే ఉన్నారని అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించిన తర్వాతే దాన్ని అమలు జరిగిందన్నారు. కానీ, బీజేపీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని మండిపడ్డారు. ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెట్టి ఎంతకాలం అధికారంలో కొనసాగుతారని ప్రస్నించారు.

ప్రజాస్వామ్య నిబంధనలు ఉల్లంఘిస్తోంది

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఐక్యమయ్యాయని పేర్కొన్నారు. అంతకుముందు, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీ ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతాయని.. ఇలాంటి పొరపాటు పునరావృతం కావద్దన్నారు. విపక్షాల నుంచి ఆటంకాలను ప్రజలు కోరుకోవట్లేదని.. నినాదాలు ఆశించట్లేదన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు విపక్షాలు కూడా సహకరించాలని హితవు పలికారు. మోడీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.


Similar News