గాజాలో తక్షణం కాల్పుల విరమణ చేపట్టాలి: ప్రియాంక గాంధీ

Update: 2023-11-05 12:41 GMT

న్యూఢిల్లీ: గాజాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారం కాల్పుల విరమణను వెంటనే చేపట్టాలని పిలుపునిచ్చారు. గాజాలోని అల్‌షిఫా ఆసుపత్రి బయట ఉన్న ఆంబులెన్స్‌పై ఇజ్రాయెల్ దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటన మాటల్లో చెప్పలేనంత భయానకమని, సిగ్గు చేటు అని ప్రియాంకా గాంధీ అన్నారు. 'దాదాపు 10,000 మంది పౌరులు, వారిలో దాదాపు 5000 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం'పై ఆందోళన వ్యక్తం చేశారు.

'వేలమంది తమ కుటుంబాలను కోల్పోయారని, ఆసుపత్రులు, ఆంబులెన్స్‌లపై కూడా బంబుల వర్షం కురవడం బాధిస్తోందని' ఎక్స్‌లో ట్వీట్ చేశారు. శరణాస్థులు ఉంటున్న శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని, పాలస్తీనా మారణహోమానికి స్వేచ్ఛా ప్రపంచ ప్రతినిధులుగా చెప్పుకునే నేతలు ఆర్థికంగా అండగా ఉంటున్నారని తెలిపారు. తక్షణం కాల్పులను విరమించేలా అంతర్జాతీయ సమాజం ముందుకురావాలని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Tags:    

Similar News