త్రివర్ణ పతాకాన్ని తన నివాసంలో ఎగురవేసిన హోంమంత్రి అమిత్ షా

77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ 'హర్ ఘర్ తిరంగా' అని నినాదించాడు. ప్రతి భారతీయుడు తన ఇంటిపై లేదా. ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని కోరారు.

Update: 2023-08-14 06:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ 'హర్ ఘర్ తిరంగా' అని నినాదించాడు. ప్రతి భారతీయుడు తన ఇంటిపై లేదా. ఇంటి ముందు జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని కోరారు. ఇందులో భాగంగా.. భారత హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలోని తన నివాసంలో తిరంగ జెండాను ఎగురవేశారు. కాగా ఆగస్టు 15న న్యూఢిల్లీలో జరిగే 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్పంచ్‌లు, ఖాదీ కార్మికులు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, నర్సులతో సహా దాదాపు 1,800 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14వ తేదీ సోమవారం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు


Similar News