ఒకే క్లాస్‌, ఒకే బోర్డ్‌, ఒకే టైమ్‌.. 2 స‌బ్జెక్ట్స్.. మొత్తుకుంటున్న టీచ‌ర్లు! (వీడియో)

ఈ ప‌రిస్థితిపై ప్ర‌భుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది. Hindi and Urdu teachers share same blackboard at same time..

Update: 2022-05-17 07:54 GMT

దిశ, వెబ్‌డెస్క్ః ప్ర‌భుత్వ పాఠ‌శాలలంటే అంద‌రికీ చిన్న చూపే! క‌డుపు నిండ‌నోళ్లు త‌ప్ప అక్క‌డ పిల్ల‌ల్ని చ‌దింవించే త‌ల్లిదండ్రులే క‌రువ‌య్యారు. ప్ర‌యివేటు స్కూల్ టీచ‌ర్ల కంటే గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ టీచ‌ర్ల‌కే స‌బ్జెక్ట్ ఎక్కువైనా, స్కూళ్ల‌లో స‌దుపాయాలు లేక మేము పాఠాలు చెప్ప‌లేక‌పోతున్నామంటారు. ఈ ప‌రిస్థితికి అద్దం ప‌ట్టే ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని కతిహార్‌లో ఉన్న ఓ ప్ర‌భుత్వ‌ పాఠశాలలో ఇద్దరు టీచ‌ర్లు ఒకే తరగతి గదిలో, ఒకే బ్లాక్‌బోర్డ్ పైన‌, ఒకే స‌మ‌యంలో రెండు వేర్వేరు భాష‌ల‌ను బోధించడమే ఈ వీడియోలో విశేషం. మ‌రో విచిత్రం ఏంటంటే, ఈ రెండు సబ్జెక్టులను ఒకే తరగతి విద్యార్థులకు బోధిస్తుండ‌టం. ఉపాధ్యాయుల్లో ఒకరు హిందీ బోధిస్తుంటే, మరో అధ్యాపకుడు విద్యార్థులకు ఉర్దూ బోధిస్తున్నారు.

ఈ వింత బోధనా విధానం వెనుక కారణం గురించి హిందీ ఉపాధ్యాయురాలు ప్రియాంక మీడియాకు వివ‌రించారు. ANIతో ఆమె పరిస్థితిని క్లుప్తంగా చెబుతూ, "2017లో విద్యా శాఖ ద్వారా ఉర్దూ ప్రాథమిక పాఠశాలను మా పాఠశాలకు మార్చారు. అప్ప‌టి నుండి హిందీ, ఉర్దూ రెండింటినీ ఒకే తరగతి గదిలో బోధిస్తున్నాము. మా పాఠశాలలో త‌గిన‌న్ని తరగతి గదులు లేవు. మేము విద్యార్థులకు ఒకే గదిలో బోధించడానికి కారణం ఇదే" అని ఆమె వివ‌రించారు. ఈ వింత ప‌రిస్థితిపై స్పందించిన‌ జిల్లా విద్యాశాఖాధికారి కామేశ్వర్‌ గుప్తా.. "ఈ ఆదర్శ్‌ మిడిల్‌ స్కూల్‌లో విద్యార్థుల తక్కువగా ఉన్నారు. అయితే, ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు ఒక గది ఇస్తాం. వేర్వేరు తరగతుల పిల్లలకు ఒకే గదిలో ఒకే బ్లాక్‌బోర్డ్‌పై బోధించడం మంచిది కాదు" అన్నారు. ఈ ప‌రిస్థితిపై ప్ర‌భుత్వ అధికారులు స్పందించాల్సి ఉంది. 


Similar News