వీఐపీ సంస్కృతికి ముగింపు పలికిన అసోం సీఎం
అసోంలో వీఐపీ సంస్కృతికి ముగింపు పలికినట్లు సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. జులై 1 నుంచి స్వయంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో వీఐపీ సంస్కృతికి ముగింపు పలికినట్లు సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. జులై 1 నుంచి స్వయంగా విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. ఇకపై తాను, అసోం సీఎస్ కరెంటు బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించి ప్రభుత్వ అధికారుల కరెంటు బిల్లులు చెల్లించే వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతున్నట్లు పేర్కొన్నారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ లో పంచుకున్నారు. జూలై నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ సొంత విద్యుత్ వినియోగానికి డబ్బులు చెల్లించాలని హితవు పలికారు. మంత్రులు, సీనియర్ ప్రభుత్వ అధికారుల నివాసాలు, సచివాలయానికి కరెంటు బిల్లులు చాలాకాలంగా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. ఇకపై ఎవరి బిల్లులు వాళ్లే చెల్లించనున్నట్లు తెలిపారు. ఇది 75 ఏళ్ల వారసత్వం అని.. కొత్త వ్యవస్థ కాదని ట్వీట్ చేశారు.