అధిక దిగుబడినిచ్చే విత్తనాలు విడుదల చేసిన ప్రధాని మోదీ

దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 109 రకాల విత్తనాలను ప్రధాని మోదీ విడుదల చేశారు.

Update: 2024-08-11 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి 109 రకాల విత్తనాలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఆదివారం ఉదయం వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి అధిక దిగుబడిననిచ్చె 109 రకాల కొత్త రకం విత్తనాలను ప్రధాని విడుదల చేశారు. అధిక దిగుబడి, అన్ని రకాల వాతావరణ పరిస్తుతులను తట్టుకునే వంగడాల తయారీ లక్ష్యంగా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదొక గొప్ప ముందడుగు అని మోదీ అన్నారు. దేశ ప్రజల పోషకారం వైపు మొగ్గుతున్నారని, అందులో భాగంగా సహజంగా, సేంద్రీయ పద్దతులను అనుసరించి పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా కోరుకుంటున్నారని అన్నారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రాబోయే రెండేళ్లలో కోటిమంది రైతులను సేంద్రీయ వ్యవసాయంలోకి తీసుకు రావడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఇలాంటి పంటల మీద భారత్ మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని విడుదల చేసిన విత్తనాల్లో మినుములు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, చెరకు, తృణధాన్యాలతోపాటు, వివిధ రకాల పండ్లు, కూరగాయలు, దుంప పంటలు, ఔషధ మొక్కలు, పువ్వుల మొక్కలు ఉన్నాయి. ఈ సందర్భంగా కొత్తరకం విత్తనాలను తయారు చేసిన శాస్త్రవేత్తలను ప్రధాని ప్రశంసించారు. 


Similar News