దూసుకొస్తున్న తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ

ఈ తుఫాను తీరం దాటే సమయంలో భారీ నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

Update: 2023-06-14 07:50 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఇప్పటికే ముందు జాగ్రత్త హెచ్ఛరికలు జారీ చేసిన వాతావరణ శాఖ బిపర్‌జాయ్ తుఫాన్ దూసుకొస్తుండటంతో 8 రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. గుజరాత్ సహా కేరళ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపు సాయంత్రం జఖౌ పోర్టు దగ్గర తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో భారీ నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే తీర ప్రాంత రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్‌లో కచ్, ద్వారాక, సౌరాష్ట్రకు రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. కచ్, ద్వారక, పోర్ బందర్, జామ్ నగర్, మోర్బీ, జునాగఢ్, రాజ్‌కోట్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, 25 సెం.మీ వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు తెలిపారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో భారీ నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News