దిశ మార్చుకున్న తుఫాన్.. భారీ వర్షాలు

బిపర్‌జాయ్ తుపాన్ తన దిశను మార్చుకుంది. ఇప్పుడు అది రాజస్థాన్ వైపు మళ్లింది.

Update: 2023-06-17 05:09 GMT

దిశ,వెబ్‌డెస్క్: బిపర్‌జాయ్ తుపాన్ తన దిశను మార్చుకుంది. ఇప్పుడు అది రాజస్థాన్ వైపు మళ్లింది. తుపాన్ ప్రభావం వల్ల రాజస్థాన్‌ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర తుపాన్ సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది ఈశాన్య దిశగా కదులుతుందని భావిస్తున్నామని ఐఎండీ అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ తుఫాన్ విపత్తుతో 22 మందికి గాయాలు కాగా, 940 గ్రామాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి అందకారంలో ఉన్నాయి.

ఈ  తుఫాన్ బిపర్‌జాయ్ శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు నాలియాకు ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది అని ఐఎండీ ఒక ట్వీట్‌ చేసింది. తుఫాన్ సముద్రం నుంచి భూమికి వచ్చి సౌరాష్ట్ర-కచ్ వైపు కేంద్రీకృతమై ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. గుజరాత్‌లో విధ్వంసం తర్వాత,బిపర్ జోయ్ తుఫాను రాజస్థాన్‌కు మళ్లింది.


Similar News