మృతదేహాలను చూసి గుండెపోటు.. యువ కానిస్టేబుల్ మృతి!

ఉత్తర్‌ప్రదేశ్‌ హథ్రాస్ జిల్లాలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది

Update: 2024-07-03 02:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ హథ్రాస్ జిల్లాలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 116 మంది మరణించారు. కొంతమంది అక్కడికక్కడే మరణించగా.. మరికొంతమంది ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ప్రాణాలు విడిచారు. ఇంకా చాలా మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడి ఎటా మెడికల్ కళాశాలలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసిన రజనీశ్ అనే 30 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో చనిపోయారు. రజనీశ్‌కు క్విక్ రెస్పాన్స్ టీమ్ లో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో అక్కడున్న మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. దీంతో రజనీశ్ అక్కడిక్కడే మరణించారు.

యూపీలో ప్రతి సంవత్సరం సత్సంగ్‌ను ఏర్పాటు చేస్తారు. హత్రాస్ జిల్లా సికందరరావు పోలీసు స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పూర్‌లో భోలే బాబా తత్సంగ్ శివారాధన కార్యక్రమం సందర్భంగా అక్కడ భక్తులకు గంగాజలం అందిస్తారు. ఈ గంగాజలాన్ని తీసుకుంటే మన శరీరంలో ఉన్న అన్ని వ్యాధులు తగ్గుతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా కొత్త రోగాలు కూడా దరిచేరవని నమ్ముతారు. ప్రతి ఏటా సజావుగా సాగే ఈ సత్సంగ్ ఈ ఏడాది విషాదం నెలకొంది. 


Similar News