సురభి మెడికల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్

సురభి మెడికల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ తో 15 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-07-05 11:55 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సురభి మెడికల్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ తో 15 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...సిద్దిపేట అర్బన్ మండలం మెట్టపల్లి గ్రామంలోని సురభి మెడికల్ కాలేజీలో హాస్టల్ లో గురువారం విద్యార్థులు భోజనం చేసిన అనంతరం వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యారు.

    విషయం బయట తెలయకుండా కళాశాల సిబ్బంది విద్యార్థులను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కళాశాల హాస్టల్ లో నాసిరకం ఆహార పదార్థాలతో ఆహారం తయారు చేయడం, పారిశుధ్యం పాటించకపోవడం మూలంగానే విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన కళాశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై మెడికల్ కళాశాల సిబ్బందిని ఆరా తీయడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.


Similar News