'ఇండియా' పేరుపై వివరణ ఇవ్వండి.. ఢిల్లీ హైకోర్టు ఆదేశం

విపక్ష కూటమికి "ఇండియా" (I.N.D.I.A) పేరును ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని

Update: 2023-08-04 16:33 GMT

న్యూఢిల్లీ : విపక్ష కూటమికి "ఇండియా" (I.N.D.I.A) పేరును ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, విపక్ష కూటమిని ఆదేశించింది. తదుపరి విచారణకు అక్టోబర్ 31కి వాయిదా వేసింది. 26 రాజకీయ పార్టీలు వాటి కూటమికి "ఇండియా" పేరు ఉపయోగించకుండా చూడాలని పిటిషనర్ కోరాడు.

"ఇండియా" అనే పదాన్ని వాడినందుకు రాజకీయ పార్టీలపై కేంద్రం, ఈసీ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న పార్టీల కూటమికి యూపీఏ అనే పేరు ఉండేది. తాజాగా ఆ పేరును పక్కన పెట్టి "ఇండియా" అని కొత్త పేరు పెట్టారు. గతంలో బెంగళూరులో సమావేశమైన విపక్షాలు తమ కూటమికి "ఇండియా" అనే పేరును ప్రకటించాయి.


Similar News