పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టు ఉపశమనం

మెజిస్ట్రేట్ కోర్టు అనుమతిచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది.

Update: 2024-07-12 15:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో ఉపశమనం లభించింది. పరువు నష్టం కేసులో కొత్త, అదనపు డాక్యుమెంట్లను సమర్పించడానికి ఆరెస్సెస్ కార్యకర్తకు మెజిస్ట్రేట్ కోర్టు అనుమతిచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు శుక్రవారం రద్దు చేసింది. 2014లో ఆరెస్సెస్ కార్యకర్త రాజేష్ కుంటె భివండి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. మహాత్మ గాంధీ హత్యకు ఆరెస్సెస్ సంస్థే కారణమని రాహుల్ గాంధీ ఓ ప్రసంగంలో తప్పుడు వ్యాఖ్యలు, పవురు నష్టం కలిగించే ప్రకటన చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే, రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం 2023లో ఇదే పిటిషన్‌లో భాగంగా భివండి మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీ ప్రసంగానికి సంబంధించిన ప్రింటెడ్ కాపీని అందించేందుకు రాజేష్ కుంటెకు అనుమతిచ్చింది. దీనిపై మెజిస్ట్రేట్ ఆదేశాలను రాహుల్ గాంధీ బాంబే హైకోర్టులో సవాలు చేశారు. శుక్రవారం జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన సింగిల్ బెంచ్ రాహుల్ గాంధీ పిటిషన్‌ను అమోదించింది. అదనపు పత్రాల సమర్పనకు అనుమతిని ర్ద్దు చేస్తూ విచారణను కొనసాగించాలని మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ విచారణను త్వరితగతిన పరిష్కరించాలని మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు.  


Similar News