నలుగురు భార్యలు ఉండడం అసాధారణం: Nitin Gadkari కీలక వ్యాఖ్యలు

ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-12-09 11:13 GMT

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌర స్మృతిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నలుగురు భార్యలు ఉండడం అసాధారణమని అన్నారు. శుక్రవారం ఆజ్ తక్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఏదైనా ముస్లిం దేశం రెండు సివిల్ కోడ్ లను కలిగి ఉందా? ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకోవడం సాధారణం. కానీ ఒకే వ్యక్తి నలుగురిని పెళ్లి చేసుకోవడం అసాధారణం. ముస్లిం సమాజంలో అభ్యుదయవాదులు, విద్యావంతులు నాలుగు పెళ్లిళ్లు చేసుకోరు. యూసీసీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఇది దేశాభివృద్ధి కోసం' అని గడ్కరీ అన్నారు.

యూసీసీ వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, పేదలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా పరిగణనలో ఉంటుందని, సానుకూలంగా ఉంటే దేశం మొత్తానికి ప్రయోజనమని చెప్పారు. అంతకుముందు అసోం సీఎం బిస్వంత శర్వ ముస్లిం వ్యక్తులు ముగ్గురు-నలుగురు భార్యలను కలిగి ఉండొద్దని అన్నారు.

Tags:    

Similar News