Haryana: హర్యానాకు 'డబుల్ ఇంజన్' కాదు.. 'కొత్త ఇంజన్' అవసరం: పంజాబ్ సీఎం

రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అధికారంలోకి తీసుకురావాలని విన్నవించారు.

Update: 2024-09-01 19:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల ప్రచారం వేగంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ విమర్శల వేడిని పెంచారు. తాజాగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అధికారంలోకి తీసుకురావాలని విన్నవించారు. ఇదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ అవసరంలేదని, కొత్త ఇంజన్ కావాలన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీతో పాటు కాంగ్రెస్, ఐఎన్ఎల్‌డీ పార్టీలకు అనేకసార్లు అవకాశం ఇచ్చారు. వారెవ్వరూ అభివృద్ధి నిర్ణయాలు తీసుకోలేదు. గత 78 ఏళ్లలో ప్రజల సమస్యలు పెరిగాయి. దేశంలో ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు కొత్త ఇంజన్‌తో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. అలాగే, హర్యానాకు కూడా కొత్త ఇంజన్‌ కావాలని అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఉచిత విద్య, కరెంటు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని. ఈ అంశాల్లో హర్యానా వెనుకబడిందని, అందుకే ఆప్‌ను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.  

Tags:    

Similar News