Haryana Elections: 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2100.. హర్యానాలో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

హర్యానా ఎన్నికలకు గాను బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంకల్ప్ పత్ర పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను నడ్డా విడుదల చేశారు.

Update: 2024-09-19 08:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా ఎన్నికలకు గాను బీజేపీ తన మేనిఫెస్టోను గురువారం రిలీజ్ చేసింది. సంకల్ప్ పత్ర పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను పార్టీ చీఫ్ నడ్డా రోహ్ తక్‌లో విడుదల చేశారు. ఇందులో 20 కీలక వాగ్ధానాలను పొందుపర్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. లాడో లక్ష్మి యోజన కింద మహిళలకు నెలకు రూ. 2,100, హర్ ఘర్ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు. హర్యానాకు చెందిన ఓబీసీ, ఎస్సీ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఏదైనా ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో చదవడానికి స్కాలర్‌షిప్‌లను కూడా ఇస్తామని ప్రకటించింది. ఆస్పత్రుల్లో డయాలసిస్ ఉచితంగా ఉంటుందని, వివా ఆయుష్మాన్ యోజన కింద రూ.10 లక్షల వరకు ఫ్రీ వైద్యం అందిస్తామని మేనిఫోస్టోలో పేర్కొంది. అంతేగాక హర్యానాలోని ప్రతి అగ్నివీర్‌కి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. 


Similar News