Haryana election: హర్యానాలో బీజేపీకి మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన కీలక నేత

అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత సుఖ్వీందర్ మండి పార్టీని వీడారు.

Update: 2024-09-14 13:39 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్వీందర్ మండి పార్టీని వీడారు. కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో శనివారం హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. బధ్రా మాజీ ఎమ్మెల్యే అయిన సుఖ్వీందర్ అదే సెగ్మెంట్ నుంచి టికెట్ ఆశించగా బీజేపీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తికి గురైన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. అంతకుముందు హర్యానా బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు. దీంతో సీనియర్ నేతలు వరుసగా పార్టీకి వీడటంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాగా, హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. 


Similar News