శబరిమల దర్శనంపై కేరళ ప్రభుత్వం షాకింగ్ ప్రకటన
శబరిమల అయ్యప్ప దర్శనాల సీజన్ దగ్గరపడుతుండడంతో కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్ప దర్శనాల సీజన్ దగ్గరపడుతుండడంతో కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శబరిమలలో కొలువైన అయ్యప్పస్వామి దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే యాత్రికులను అనుమతించబోతున్నట్లు సంబంధించి అనౌన్స్ చేసింది. మకరవిళక్కు సీజన్ దగ్గరపడుతుండడంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమల అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర ఏర్పాట్లను కూడా పరిశీలించారు.
మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇకపై రోజుకు గరిష్టంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని, అది కూడా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. ఇక వర్చువల్‌గా క్యూ బుకింగ్ చేసుకోవడం వల్ల యాత్రికులకు తమ మార్గాన్ని కూడా ఎంచుకోవడానికి వీలుండబోతోందనేది అధికారుల మాట. అయితే దర్శనాలకు భక్తుల్లో ముఖ్యంగా అటవీ మార్గం గుండా వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.