నన్ను ఉరితీయండి కానీ.. రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగకూడదు : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్

రెజ్లర్ల నిరసన కారణంగా గత నాలుగు నెలలుగా క్రీడా కార్యకాలాపాలన్నీ ఆగిపోయాయని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సోమవారం అన్నారు.

Update: 2023-05-01 12:10 GMT

న్యూఢిల్లీ: రెజ్లర్ల నిరసన కారణంగా గత నాలుగు నెలలుగా క్రీడా కార్యకాలాపాలన్నీ ఆగిపోయాయని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సోమవారం అన్నారు. తనను ఉరి తీసినా ఫరవాలేదని.. నేషనల్ చాంపియన్‌షిప్స్, క్యాంప్స్‌తో సహా రెజ్లింగ్ కార్యకాలాపాలు ఆగకూడదని చెప్పారు. ఇది క్యాడెట్, జూనియర్ రెజ్లర్లపై ప్రభావం చూపుతుందన్నారు. ‘గత నాలుగు నెలలుగా రెజ్లింగ్ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. నన్ను ఉరి తీయండి. కానీ రెజ్లింగ్ కార్యకాలాపాలు ఆగకూడదు.

పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. క్యాడెట్ నేషనల్స్‌ను జరగనివ్వండి. ఎవరు నిర్వహించినా.. అది మహారాష్ట్ర కావచ్చు తమిళనాడు కావచ్చు త్రిపుర కావచ్చు అనుమతించండి. రెజ్లింగ్ కార్యకలాపాలను ఆపకండి’ అని బ్రిజ్ భూషణ్ అన్నారు. మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా భారత టాప్ రెజ్లర్లు వినేష్ పొగట్, సాక్షిమాలిక్‌తో పాటు మరికొంత మంది జంతర్ మంతర్ వద్ద గత కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. దీంతో సుప్రీం కోర్టు జోక్యంతో బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

Tags:    

Similar News