Gukesh Chess dance : గుకేశ్ చదరంగం ఎత్తులతో నృత్యం..వైరల్ గా వీడియో

ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్(World Chess Championship) విజేతగా నిలిచి చదరంగం రారాజుగా మారిన 18ఏండ్ల భారత యువ చెస్ ఆటగాడు గుకేశ్‌(Gukesh)ను అభినందిస్తూ కథక్ కళాకారిణులు రూపొందించిన నృత్య వీడియో(Chess dance moves)వైరల్ గా మారింది.

Update: 2024-12-19 05:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్(World Chess Championship) విజేతగా నిలిచి చదరంగం రారాజుగా మారిన 18ఏండ్ల భారత యువ చెస్ ఆటగాడు గుకేశ్‌(Gukesh)ను అభినందిస్తూ కథక్ కళాకారిణులు రూపొందించిన నృత్య వీడియో(Chess dance moves)వైరల్ గా మారింది. ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్ లో గుకేశ్ తన సీనియర్ ప్రత్యర్థి డింగ్ లిరెన్ ల మధ్య సాగిన ఎత్తులు, పై ఎత్తుల ఆధారంగా కథక్ నృత్య కారిణులు అనుష్క చందక్, మైత్రేయి నిర్గుణ్ లు చేసిన నృత్య ప్రదర్శన సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలందుకుంటుంది.

నాలుగు గంటల పాటు సాగిన చెస్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆఖరి గేమ్ 58ఎత్తులతో ముగిసింది. గుకేశ్ నల్ల పావులతో, ప్రత్యర్థి లిరెన్ తెల్లపావులతో ఆడారు. వారిద్దరి చదరంగం పావులను తలపించేలా చందక్, నిర్గుణ్ లు నలుపు, తెలుపు దుస్తులు ధరించి ఫైనల్ పోరులో ప్రత్యర్థి ఎత్తులు, గుకేశ్ పై ఎత్తులు ఎలా వేశారో చాటి చెప్పేలా తమ నృత్యరీతులలో ప్రదర్శించారు. సాంప్రదాయ నృత్యానికి కొంత సృజనాత్మక నృత్యరీతులను జోడించి యుద్ధ రంగాన్ని తలపించే చదరంగ క్రీడను కళ్లకు కట్టినట్లుగా కళాకారిణులు చేసిన నాట్య ప్రదర్శన అధ్భుతమంటూ సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

చదరంగంలోని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, భటులు, రాజులు, మంత్రులతో కూడిన గుకేశ్ బలగాలు ప్రత్యర్థికి చెందిన బలగాలను ఎలా తుద ముట్టిస్తూ ముందుకెళ్లాయన్నదానిపై సంబంధిత హావాభావాలతో కళాకారిణులు ప్రదర్శించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 

Tags:    

Similar News