ఉమెన్స్ డే గిఫ్ట్.. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ కానుకగా వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ప్రకటించారు. ఇది దేశ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని వెల్లడించారు. కాగా, ఇప్పటికే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద, వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్హులైన కొనుగోలుదారులకు ఆర్థిక సహాయం కొనసాగించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని సమాచారం. ప్రస్తుతం, ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి LPG సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ అందిస్తోన్న విషయం తెలిసిందే. సంవత్సరంలో 12 సిలిండర్లు రీఫిల్లింగ్ కోసం పొందేందుకు వీలు కల్పిస్తుంది.